మెదక్టౌన్, వెలుగు: పోలింగ్ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన పట్టణంలోని గవర్నమెంట్డిగ్రీ కాలేజ్లో పీవోలు, ఏపీవోలు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, మాక్ పోల్ నిర్వహణ, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల కనెక్షన్లు, వాటి పని తీరుపై అవగాహన ఉండాలన్నారు.
ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని, తొలి సారి శిక్షణ పొందుతున్న సిబ్బంది జాగ్రత్తగా నేర్చుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మొదటి విడత శిక్షణలో భాగంగా 488 మంది, రెండో విడత ఈ నెల6న నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు, ట్రైనర్స్ పాల్గొన్నారు.