- జీహెచ్ఎంసీ కమిషనర్రోనాల్డ్ రోస్
- 12న డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చు: సిటీ సీపీ
హైదరాబాద్, వెలుగు : లోక్సభ, కంటోన్మెంట్ఉప ఎన్నికలకు హైదరాబాద్జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం టూరిజం ప్లాజాలో పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి, రిటర్నింగ్ఆఫీసర్లు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ కేశవ్ పాటిల్, మధుకర్ నాయక్ తో కలిసి ప్రెస్మీట్పెట్టారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్.. 3,986 పోలింగ్ కేంద్రాలలో వంద శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, 1,250 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు రూ.42 కోట్ల 27 లక్షల 88 వేల 386 క్యాష్, లిక్కర్, గాంజా, గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్తదితరాలను జప్తు చేశామన్నారు. 14,292 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. సికింద్రాబాద్ లో 362 మంది, హైదరాబాద్ లో 119 మంది, కంటోన్మెంట్ లో 55 మంది హోమ్ఓటింగ్ను వినియోగించుకున్నారు. 37 పాయింట్ల నుంచి ఉచిత ట్రాన్స్పోర్ట్కల్పిస్తున్నామని, ఓటర్లు వినియోగించుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జిల్లాలో జిల్లా యేతర వ్యక్తులు, ఇతర నియోజకవర్గాల వారు ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు.
పోలింగ్ సెంటర్ లోపలికి సెల్ ఫోన్ అనుమతిలేదని, ఎవరైనా సెల్ ఫోన్ తీసుకొస్తే సెంటర్ వద్ద డిపాజిట్ చేసి ఓటు వేసి వచ్చిన తరువాత సెల్ ఫోన్ తీసుకొని వెళ్లాలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 48 గంటల ముందు నుంచి లౌడ్ స్పీకర్లు, వెహికల్స్ ప్రచారం బంద్అవుతుందని, డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. 5 నుంచి 10 మంది లోపు మాత్రమే ఇంటింటి ప్రచారం నిర్వహించాలన్నారు.
