ఆర్మూర్, వెలుగు: రాష్ట్రస్థాయి అండర్ 17 బాలబాలికల హాకీ పోటీలకు జిల్లా జట్టును శుక్రవారం ఆర్మూర్లో ఎంపిక చేశారు. ఆర్మూర్ టౌన్ లోని మినీ స్టేడియంలో నిర్వహించిన హాకీ సెలక్షన్స్ లో 80 మంది బాలురు, 65 బాలికలు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 18 మంది క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేశామని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ నాగమణి, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగాల్లో ఇస్తున్న 2 శాతం స్పోర్ట్స్ కోటాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్స్ స్వప్న, స్వామి , చిన్నయ్య , నాగేశ్, బి.రాజేశ్వర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
