- జిల్లా న్యాయమూర్తి ఫర్హీన్ కౌసర్
సూర్యాపేట, వెలుగు : మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపి సూర్యాపేటను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా న్యాయమూర్తి ఫర్హీన్ కౌసర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి ఫర్హీన్ కౌసర్ ను హోలీ క్రాస్ ఫౌండేషన్ సభ్యులు కలిశారు. ఈనెల 20న శ్రీలక్ష్మి గార్డెన్ లో నిర్వహించనున్న మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సుకు హాజరుకావాలని కోరుతూ జడ్జికి ఆహ్వాన పత్రికను అందజేశారు. హోలీక్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంతకాలంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు, డీ అడిక్షన్ సెంటర్ సేవలను ఇన్చార్జి మిడతపల్లి గణపతి వివరించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు యువత బానిసలై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రతిఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. జడ్జిని కలిసిన వారిలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ కోఆర్డినేటర్స్ కంది కావేరి, నల్లగట్టు ఉపేందర్, హోలీక్రాస్ ప్రతినిధులు ఉన్నారు.

