పెట్రోల్ బంక్​ను తనిఖీ చేసిన ఆఫీసర్లు

పెట్రోల్ బంక్​ను తనిఖీ చేసిన ఆఫీసర్లు

శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్​ను గురువారం జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ సంతోష్  తనిఖీ చేశారు. పెట్రోల్​తక్కువొస్తుందని బుధవారం పలువురు వాహనదారులు ఆందోళన చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన తనిఖీ చేసి 20 ఎం.ఎల్. తక్కువ వచ్చినందున బంక్​ను క్లోజ్ చేసినట్టు తెలిపారు. మళ్లీ  తాము సర్టిఫై చేసిన తర్వాత బంక్​ ఓపెన్ చేస్తామన్నారు.