ఐఐఎంలు, ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ లోటు : ఆర్ ప్రవీణ్ కుమార్

ఐఐఎంలు, ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ లోటు : ఆర్ ప్రవీణ్ కుమార్

ఐఐఎంలు, ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ లోటు ఉందని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 9,640 ఫ్యాకల్టీలో కేవలం 23 మందిSTలు, 157 మంది SCలు మాత్రమే ఉన్నారని చెప్పారు. దాంతో పాటు ఓ జాతీయ వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా షేర్ చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఈ కథనంలో పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో ఈ వర్గాల నుండి ఒక్క అధ్యాపకుడు కూడా లేరని చెప్పారు. డిసెంబర్‌లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డి) పార్లమెంట్‌లో సమర్పించిన డేటా ప్రకారం.. 18 ఐఐఎంలలో మంజూరైన 784  ఫ్యాకల్టీ పోస్టులలో కేవలం రెండు మాత్రమే ఎస్టీ వర్గానికి చెందినవని తెలిపారు.

ఓబీసీ కేటగిరీకి చెందిన 27 మంది సభ్యులు ఉండగా కేవలం ఎనిమిది మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారని, ఎస్సీల పరిస్థితి ఏమీ బాగోలేదన్నారు. ఐఐఎంలలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఫ్యాకల్టీ సభ్యులలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నారని, ఐఐటీల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉందని స్పష్టం చేశారు. మంజూరైన 8,856 మంది అధ్యాపకుల్లో 4,876 మంది జనరల్ కేటగిరీ, 329 మంది ఓబీసీలు, 149 మంది ఎస్సీలు, 21 మంది ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఫలితంగా కొత్త, పాతవి కలిపి 23 IITలలో ప్రస్తుతమున్న ఫ్యాకల్టీలో 9 శాతం మాత్రమే SCలు, STలు లేదా OBCలు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో అయితే SC, ST లేదా OBC ఫ్యాకల్టీ అసలే లేరని వివరించింది.