బీఆర్‌ఎస్ పార్టీ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. MLAల అనర్హతపై హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్ట్ డివిజన్ బెంచ్ తెలిపింది. అక్టోబర్ 24న కేసులో వాదనలు వింటామని డివిజన్ బెంచ్ పేర్కొంది.
ALSO READ : ఈటలా.. నోరు అదుపులో పెట్టుకో : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్
ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని గడువు ఇస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించిన హైకోర్ట్ చెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజనల్ బెంచ్ లో పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్ట్ డివిజన్ బెంచ్ తెలిపింది.