
సమంత(Samantha), నాగచైతన్య(Naga chaitanya) నటించిన మజిలీ(Majili) సినిమాలో మెరిసింది నటి దివ్యాంశ కౌశిక్(Divyansha kaushik). ఆ తర్వాత రవితేజ(Raviteja), సందీప్ కిషన్(Sandeep kishan) వంటి హీరోలతో రామారావు ఆన్ డ్యూటీ(Ramarao on duty), మైఖేల్(Micheal) వంటి మూవీస్ చేసినా ఆశించిన రిజల్ట్ అందుకోలేదు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు జోరు పెంచినట్టు తెలుస్తోంది.
తాజాగా విజయ్ దేవరకొండ(Vijay devarakonda) సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. పరుశురాం(Parusuram) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా దివ్యాంశ కి చాన్స్ దక్కింది. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్(Family star) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.