నవంబర్ 13న హైకోర్టుకు దీపావళి సెలవు

నవంబర్ 13న హైకోర్టుకు దీపావళి సెలవు

హైదరాబాద్, వెలుగు :  దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని న్యాయస్థానాలకు సెలవుదినంగా హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు, జిల్లా కోర్టులు, ఇతర కోర్టులు, ట్రిబ్యునల్స్‌‌కు 13వ తేదీ దీపావళి సెలవని హైకోర్టు రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ బుధవారం తెలియజేశారు.