హైదరాబాద్, వెలుగు: దీపావళి సందర్భంగా బిగ్ సీ పలు ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా డౌన్‌పేమెంట్, ఎటువంటి వడ్డీ లేకుండానే సులభ వాయిదాల్లో మొబైల్ కొనే సౌకర్యాన్ని కలిపిస్తోంది. ప్రతీ మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని ఆఫర్ చేస్తోంది. బిగ్ సీలో బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్స్ కొంటే రూ. 3,500 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా కొంటే రూ.1,500 వరకు, అమేజాన్ పే ద్వారా కొంటే రూ. 3,500 వరకు క్యాష్ బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ మొబైల్స్‌పై రూ. 6 వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది.
