10 నిమిషాల్లో డెలివరీ బంద్.. కేంద్ర మంత్రి ఆదేశాలతో బ్లింకిట్ నిర్ణయం

10 నిమిషాల్లో డెలివరీ బంద్.. కేంద్ర మంత్రి ఆదేశాలతో బ్లింకిట్ నిర్ణయం

అలా ఆర్డర్ చేయగానే ఇలా సరుకులు, ఫుడ్ ఇంటికి వచ్చే రోజులు పోతున్నాయి. ఇలా క్విక్ కామర్స్ కంపెనీలు తమ మధ్య ఉన్న పోటీతో గిగ్ వర్కర్ల ప్రాణాలపైకి వస్తోందనే ఆందోళనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా జోక్యంతో క్విక్ కామర్స్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డెలివరీ భాగస్వాముల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్, జొమాటో తమ ప్లాట్‌ఫారమ్‌ల నుండి '10 నిమిషాల డెలివరీ' నిబంధనను తొలగించాయి. గత కొంతకాలంగా గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడిని తగ్గించే దిశగా తీసుకున్న కీలకమైన చర్యగా ఇది నిలిచింది.

ALSO READ : అప్పట్లో పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం

తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే నిబంధన కారణంగా గిగ్ వర్కర్లు ప్రాణాలకు తెగించి ట్రాఫిక్‌లో వాహనాలు నడపాల్సి వచ్చేది. కొన్నిసార్లు చాలా మంది సమానికి డెలివరీ ఇచ్చేందుకు రాంగ్ రూట్ లో వెళ్లటం, సిగ్నల్ జంపింగ్ వంటివి కూడా రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది అనేక ప్రమాదాలకు దారి తీయడమే కాకుండా వారి పని పరిస్థితులను దుర్భరంగా మార్చింది. ఈ ఒత్తిడికి నిరసనగా డిసెంబర్ 25, 31 తేదీల్లో లక్షలాది మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. కార్మిక సంఘాలు, గిగ్ వర్కర్ల సమాఖ్య ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో, డెలివరీ డెడ్ లైన్ టైమింట్స్ తొలగించాలని కేంద్ర మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే.

ALSO READ : పొరపాటున రాంగ్ UPIకి డబ్బు పంపారా? కంగారు పడకండి.. ఇలా వెనక్కి తెచ్చుకోండి

మంత్రి ఆదేశాలకు సానుకూలంగా స్పందించిన బ్లింకిట్.. తన బ్రాండ్ ట్యాగ్‌లైన్‌ను వెంటనే తొలగించింది. గతంలో "10 నిమిషాల్లో 10 వేల ఉత్పత్తులు" అని ఉన్న ప్రకటనను,.. ఇప్పుడు "మీ ఇంటి వద్దకు 30 వేలకు పైగా ఉత్పత్తులు" అని మార్చేసింది కంపెనీ. డెలివరీ డెడ్‌లైన్ ఒత్తిడిని తొలగించడం ద్వారా వర్కర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని కంపెనీలు భరోసా ఇచ్చాయి. జెప్టో, స్విగ్గీ వంటి ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. సోషల్ మీడియా ప్రకటనల నుండి కూడా డెలివరీ సమయాన్ని తొలగించేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ నిర్ణయం గిగ్ వర్కర్ల సంక్షేమానికి, ఆరోగ్యానికి ఎంతగానో ముఖ్యమైనదిగా నిపుణులు చెబుతున్నారు.