భయంకరమైన ఆకలితో ఉన్నారా.. బయటకు వెళ్లే ఓపిక కూడా లేదా.. డోంట్ వర్రీ అనుకుంటూ.. క్విక్ డెలివరీ.. 10 నిమిషాల్లో వచ్చే ఆర్డర్స్ పెట్టుకునే వాళ్లం.. జస్ట్ 10 అంటే 10 నిమిషాల్లోనూ.. మీ ఆర్డర్ మీ ఇంటి గడప దగ్గరకు వస్తుంది.. ఇప్పటి వరకు అలవాటు అయిన ఈ సిస్టంలో ఉన్నవాళ్లకు ఇది బిగ్ షాక్.. ఇక నుంచి 10 అంటే 10 నిమిషాల్లో డెలివరీ లేదు.. ఇండియా మొత్తం బ్యాన్. 10 నిమిషాల డెలివరీ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వ ఎత్తేసింది. 10 నిమిషాల్లో మీ ఆర్డర్ మీ ఇంటికి రావాలంటే.. గతంలో మాదిరిగా వెంటనే ఆర్డర్ పెడితే కుదరదు.
ఇకపై పది నిమిషాల్లో ఆర్డర్ ఇంటికి రావాలనుకుంటే.. మీరు 10 నిమిషాల ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాలి. అర్ధం కాలేదా.. ఇప్పుడు మీరు ఏమైనా ఐటెం కావాలనుకుంటే 10 నిమిషాల్లో వచ్చేలా క్విక్ కామర్స్ సైట్లలో ఆర్డర్ పెడతారు. ప్రస్తుతం ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 10 మినిట్స్ ఆర్డర్‌ను ఎత్తేసింది. దీంతో ఇప్పటినుంచి మనకు ఏమైనా కావాలనుకుంటే 10 నిమిషాల ముందే ఆర్డర్ పెట్టుకోవాలనమాట. ఇప్పటి మాదిరిగా అనుకున్నదే తడవుగా ఆర్డర్ పెడితే కుదరదు. ఆర్డర్ రాదు. మరీ ఈ ఆప్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసేసింది..? దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం..
ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం నడుస్తోంది. బట్టలు, చెప్పులు, ఫుడ్.. ఇలా ఏం కావాలన్న ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఆర్డర్ ఇంటికి వచ్చేస్తోంది. క్విక్ కామర్స్ కంపెనీలు పోటాపోటీగా 10 మినిట్స్‌లోనే ఆర్డర్ ఇంటికి పంపిస్తామనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. ఈ నిబంధన గిగ్ వర్కర్ల ప్రాణాలపైకి వస్తోంది. వేగంగా ఆర్డర్ డెలివరీ చేయాలని తొందర్లో డెలివరీ బాయ్స్ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువై పోవడంతో గిగ్ వర్కర్ల భద్రతపై ఆందోళన నెలకొంది. పలువురు రాజకీయ నేతలు కూడా ఈ రూల్ ను తీవ్రంగా వ్యతిరేకించారు.
క్విక్ కామర్స్ ధనార్జనతో గిగ్ వర్కర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ రాజ్య సభ ఎంపీ రాఘవ్ చద్దా ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. పార్లమెంట్ వేదికగా 10 మినిట్స్ ఆర్డర్ సిస్టమ్‌ను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. ఇలా క్విక్ కామర్స్ కంపెనీల మధ్య పోటీ గిగ్ వర్కర్ల ప్రాణాలపైకి వస్తోందనే ఆందోళనలు దేశవ్యాప్తంగా పెరుగుతుండంతో తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. గిగ్ వర్కర్ల భద్రతకు సవాల్ గా మారిన 10 మినిట్స్ డెలివరీ సిస్టమ్ ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇకపై క్విక్ కామర్స్ సైట్లలో 10 నిమిషాల ఆర్డర్ సిస్టమ్ ఉండదు. దీంతో మనకు ఏమైనా కావాలనుకుంటే 10 నిమిషాల ముందు ఆర్డర్ పెట్టుకోవాలనమాట. ఇప్పటి మాదిరిగా అనుకున్నదే తడవుగా ఆర్డర్ పెడితే కుదరదు. ఆర్డర్ రాదు.
తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా జోక్యంతో క్విక్ కామర్స్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డెలివరీ భాగస్వాముల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్, జొమాటో తమ ప్లాట్‌ఫారమ్‌ల నుండి '10 నిమిషాల డెలివరీ' నిబంధనను తొలగించాయి. గత కొంతకాలంగా గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడిని తగ్గించే దిశగా తీసుకున్న కీలకమైన చర్యగా ఇది నిలిచింది.
తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే నిబంధన కారణంగా గిగ్ వర్కర్లు ప్రాణాలకు తెగించి ట్రాఫిక్‌లో వాహనాలు నడపాల్సి వచ్చేది. కొన్నిసార్లు చాలా మంది సమానికి డెలివరీ ఇచ్చేందుకు రాంగ్ రూట్ లో వెళ్లటం, సిగ్నల్ జంపింగ్ వంటివి కూడా రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది అనేక ప్రమాదాలకు దారి తీయడమే కాకుండా వారి పని పరిస్థితులను దుర్భరంగా మార్చింది. ఈ ఒత్తిడికి నిరసనగా డిసెంబర్ 25, 31 తేదీల్లో లక్షలాది మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. కార్మిక సంఘాలు, గిగ్ వర్కర్ల సమాఖ్య ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో, డెలివరీ డెడ్ లైన్ టైమింట్స్ తొలగించాలని కేంద్ర మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే.
మంత్రి ఆదేశాలకు సానుకూలంగా స్పందించిన బ్లింకిట్.. తన బ్రాండ్ ట్యాగ్‌లైన్‌ను వెంటనే తొలగించింది. గతంలో "10 నిమిషాల్లో 10 వేల ఉత్పత్తులు" అని ఉన్న ప్రకటనను,.. ఇప్పుడు "మీ ఇంటి వద్దకు 30 వేలకు పైగా ఉత్పత్తులు" అని మార్చేసింది కంపెనీ. డెలివరీ డెడ్‌లైన్ ఒత్తిడిని తొలగించడం ద్వారా వర్కర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని కంపెనీలు భరోసా ఇచ్చాయి. జెప్టో, స్విగ్గీ వంటి ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. సోషల్ మీడియా ప్రకటనల నుండి కూడా డెలివరీ సమయాన్ని తొలగించేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ నిర్ణయం గిగ్ వర్కర్ల సంక్షేమానికి, ఆరోగ్యానికి ఎంతగానో ముఖ్యమైనదిగా నిపుణులు చెబుతున్నారు.
