భారత ఆటోమొబైల్ ప్రపంచంలో ప్రముఖ పేరు అయినా టాటా మోటార్స్ సరికొత్త రూపంలో పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అక్టోబర్ 2021లో ప్రారంభమైనప్పటి నుండి, పంచ్ అత్యంత ఇష్టపడే టాటా కార్లలో ఒకటిగా ఇంకా అత్యంత డిమాండ్ ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటిగా మారింది. లుక్స్ విషయానికొస్తే, కొత్త పంచ్ ప్రస్తుత కార్లతో పోలిస్తే చాల అప్‌గ్రేడ్‌లతో వస్తుంది
ఈ కొత్త పంచ్ కార్ ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్. కారు బయట నుంచి చూడటానికి చాల బోల్డ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. సిటీలో తిరగడానికి, స్టైలిష్ కారు కావాలనుకునే వారికీ ఈ కార్ బాగా నచ్చుతుంది.
ALSO READ : ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సంక్రాంతి హాలిడేస్..
కారు లోపలి భాగం అంటే ఇంటీరియర్ ఇప్పుడు మరింత కలర్‌ఫుల్‌గా, లగ్జరీగా ఉంటుంది. ఎందుకంటే కూర్చోవడానికి సౌకర్యంగా ఉండటమే కాకుండా, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను దీనికి చేర్చారు.
ఈ కారుకి కొత్తగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (iTurbo) ఇంజిన్ అమర్చారు. దింతో పాత మోడల్ కారు కంటే ఎక్కువ స్పీడ్, పవర్ ఇస్తుంది. CNG కారు కావాలనుకునే వారి కోసం iCNG మోడల్ కూడా ఉంది. ఇందులో కూడా ఆటోమేటిక్ గేర్ (AMT) ఫీచర్ ఉండటం విశేషం. దీనివల్ల మైలేజీ కూడా ఎక్కువ వస్తుంది.
ALSO READ : పొరపాటున రాంగ్ UPIకి డబ్బు పంపారా?
టాటా పంచ్ ఎప్పుడూ సేఫ్టీకి పెట్టింది పేరు. ఇప్పుడు దీనికి కొత్త డిజైన్, టర్బో ఇంజిన్, తక్కువ ధర తోడయ్యాయి. తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి SUV లాంటి కారు కావాలనుకునే వారికి 2026 మోడల్ టాటా పంచ్ ఒక బెస్ట్ ఛాయిస్.
