IND vs NZ: కొత్త కుర్రాడు అరంగేట్రం.. నితీష్‌కు నో ఛాన్స్.. రెండో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs NZ: కొత్త కుర్రాడు అరంగేట్రం.. నితీష్‌కు నో ఛాన్స్.. రెండో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో వన్డేకు సిద్ధమవుతుంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే  బుధవారం (జనవరి 14) జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. రాజ్ కోట్ వేదికగా నిరంజన్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. రెండో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..
        
ఒకే మార్పుతో టీమిండియా:

తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు కేవలం ఒక్క మార్పుతో రెండో వన్డేలో బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో గాయం కారణంగా సిరీస్ కు దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ స్థానంలో ఆయుష్ బదోనీ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. నితీష్ కుమార్ ఆడతాడని భావించినా బదోని వైపే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బదోనీ స్పిన్ వేయడమే ఇందుకు కారణం. జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ప్లేయింగ్ 11 లో ఉండాలి. సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రానా పేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఒకవేళ నితీష్ ప్లేయింగ్ 11 లోకి వస్తే అప్పుడు భారత జట్టులో నాలుగు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉంటారు. బదోని స్పిన్ ఆల్ రౌండర్ కావడంతో ఈ ఢిల్లీ ఆల్ రౌండర్ రెండో వన్డేలో డెబ్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ALSO READ : చిన్నప్పటి ఫోటో దించేశాడు

కెప్టెన్ శుభమాన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ స్థానానికి తిరుగు లేదు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఆడతాడు. టాప్ -5 వరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు ఉండవు. ఆరో స్థానంలో ఆయుష్ బదోని తొలి వన్డే ఆడే ఛాన్స్ ఉంది. ఏడో స్థానంలో జడేజా స్థానానికి ఎలాంటి డోకా లేదు. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటారు. 

ALSO READ : RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

న్యూజిలాండ్ తో రెండో వన్డేకు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్