రాధిక రోల్​పై సస్పెన్స్​..

రాధిక రోల్​పై సస్పెన్స్​..

డీజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి(Neha Shetty) టాలీవుడ్​లో స్పీడు పెంచింది. శ్రీలీల వంటి కుర్ర హీరోయిన్ల దూకుడుకు బ్రేకులు వేస్తూ సైలెంట్​గా సినిమాలు చేసేస్తోంది. రాధిక రోల్​తో టాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

నేహాను మరోసారి రాధికగా చూడాలని..అలాగే, ఒకసారి టిల్లు ఆఫీస్ కు వెళ్లి కనుక్కోండి..మేకర్స్ మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ కాలేదని గట్టిగా అడగండి అంటూ.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నట్లు తెలిపింది. టిల్లూ స్క్వేర్​లో తన పాత్ర కొనసాగింపు ఉంటుందా అని రోజుకు ఎంతో మంది ఇలా మెసేజులు చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి నిజంగానే ఉంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఇది సస్పెన్స్​ అంటూ నవ్వులు చిందించింది.దీంతో ఈ మూవీలో రాధిక సప్రైజ్​కచ్చితంగా ప్లాన్​ చేసే ఉంటారని తెలుస్తోంది. 

తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది నేహాశెట్టి. చూసే చూసే సాంగ్ తో తనలోని హాట్ డ్యాన్స్ ని కుర్రాళ్ళకి పరిచయం చేస్తూ..సోషల్ మీడియాలో చేసిన డ్యాన్స్ నెటిజన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నేహా కెరీర్ డీజే టిల్లుకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. ఇటీవలే బెదురులంక సినిమాతో హిట్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్‌, విశ్వక్ సేన్​ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నేహా నటిస్తోంది.