
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(AlluArjun) పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది రష్మిక మందన్న(Rashmika Mandanna). ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ గుడ్బై, సిద్ధార్థ్ మల్హోత్ర మిషన్ మజ్నూ సినిమాలతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరస అవకాశాలతో బిజీగా ఉంది.
లేటెస్ట్గా రష్మిక..ఇంటర్నేషనల్ ఎల్లే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది..సూపర్ స్టైలిష్ లుక్లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పటి వరకు రష్మికను మోడ్రన్ డ్రెస్లో చూసి ఉంటారు..చీరలో పద్దతిగా చూసి ఉంటారు. కానీ, ప్రసెంట్ ఫోటో షూట్లో సూటు, బూటు ధరించి ట్రెండీగా అదరకొట్టింది. దీంతో..రష్మిక లుక్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. సూపర్..హాట్ లుక్ అంటూ..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆడి క్యూ8 స్పోర్ట్స్ కారుపై స్టైల్గా కూర్చొని.. స్టిల్ ఇచ్చిన ఈ ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి షేర్ చేయాగా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) తో పుష్ప2(Pushpa2) చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో రణ్బీర్(Ranbir kapoor) హీరోగా వస్తున్న యానిమల్(Animal) సినిమాలో నటిస్తోంది. అర్జున్ రెడ్డి(Arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి(Sandeep reddy vanga) వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమ..డిసెంబర్లో రిలీజ్ కానుంది.