ప్రజల్లోకి పోలేకనే గంటల కొద్దీ ప్రెస్ మీట్లు

ప్రజల్లోకి పోలేకనే గంటల కొద్దీ ప్రెస్ మీట్లు

హైదరాబాద్: ప్రజల్లోకి పోలేకనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి గంటల కొద్దీ మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రెస్ మీట్ అయిపోగానే  సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ కు చెక్కేస్తారని  ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ... ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ సభకు వచ్చిన రెస్పాన్స్ చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. అందుకే బీజేపీ జాతీయ నేతలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక పీఎం మోడీపై కూడా కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ భాషను చూసిన తర్వాత... ఆయనను సీఎం అనడానికి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని విమర్శించారు. కేసీఆర్ లాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలంటే జనాలకు  అసహ్యం  కలుగుతోందన్నారు

పాస్ పోర్ట్ బ్రోకర్ కేసీఆర్

కేసీఆర్ సీఎం కాదని... పాస్ పోర్ట్ బ్రోకర్ అని డీకే అరుణ ఆరోపించారు. ఒకప్పుడు పాస్ పోర్ట్ బ్రోకర్ గా ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను ప్రజలు చెట్టుకు కట్టేసి కొట్టారని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని తెలిపారు. ఇక నుంచి ఆయనను కేసీఆర్ అని కాకుండా దుబాయి శేఖర్ అని పిలువాలని అన్నారు. కేసీఆర్ కు పోయే కాలం దగ్గరపడ్డదని, అందుకే సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆరోపించారు. జోగులాంబ అమ్మవారిని అవమానించిండన్న ఆమె... జోగులాంబ అమ్మవారు కేసీఆర్ కు తగిన శాస్తి చెబుతుందని తెలిపారు. చిల్లర నా కొడుకులు బీజేపీ వాళ్లు కాదు అని.... టీఆర్ఎస్ వాళ్లే చిల్లర నా కొడుకులు అని ఫైర్ అయ్యారు.