తరుణ్ చుగ్తో చేరికల కమిటీ  భేటీ

తరుణ్ చుగ్తో చేరికల కమిటీ  భేటీ

రాష్ట్రంలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వలసలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బీజేపీ చేరికల కమిటీ సభ్యులైన బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరికలపై చర్చించారు. 

అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు నేతలు చుగ్ కు వివరించారు. దీనికి సంబంధించి 18 మంది నేతల లిస్టును ఆయనకు అందజేశారు. పార్టీలో చేరికల అంశంపై బుధవారం జేపీ నడ్డాను చేరికల కమిటీ నేతలు కలవనున్నారు. అనంతరం 18 మంది నేతలు బండి సంజయ్ పాదయాత్రలో  పార్టీలో చేరడంపై క్లారిటీ రానుంది.