అవినీతికి పాల్పడేది TRS నాయకులా?రెవెన్యూ అధికారులా?:డీకే అరుణ

అవినీతికి పాల్పడేది TRS నాయకులా?రెవెన్యూ అధికారులా?:డీకే అరుణ

సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. ఓటమి భయంతో..పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. చట్టాలో మార్పు కోసం సీఎం కేసీఆర్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడాన్నిఆమె తప్పుబట్టారు. అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా ? లేక  టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పై జనంలో నమ్మకం పోయిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. దేశమంతా మోడీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు డీకే అరుణ.