మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చెయ్యాలి: డీకే అరుణ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చెయ్యాలి: డీకే అరుణ

మహబూబ్ నగర్  కల్తీకల్లు ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చెయ్యాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.  జిల్లాలో కల్తీకల్లు  ఏరులై పారుతోందన్నారు.. కల్తీ కల్లును వెంటనే అరికట్టాలన్నారు. లేకపోతే శ్రీనివాస్ గౌడ్ తన పదవికి రాజీనామా చెయ్యాలన్నారు.  45 రోజులుగా కల్తీ కల్లు బారిన పడి  జిల్లాలో ఇద్దరు మృత్యు వాతా పడితే మీడియాను, ప్రతిపక్షాలను ఆసుపత్రిలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు.  ఇవన్నీ చూస్తుంటే కల్తీకల్లు విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

కల్తీకల్లు బారిన  పడిన మృతుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని డీకే అరుణ ప్రశ్నించారు. కల్తీ కల్లు విషయంలో పూర్తి విచారణ జరిపి వెంటనే బాధితులను  అరెస్ట్  చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి.. చికిత్స పొందుతున్న వారిని ఆదుకోవాలని కోరారు. 

 టీఎస్ పీఎస్ సీ( TSPSC) పేపర్ లికేజీ కేసులో తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికే  కేటీఆర్ రోజు బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు.  TSPSC పేపర్ లిక్ కేసును పట్టించుకోరు కానీ.. టెన్త్ పేపర్ లిక్ కేసులో తమ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని తెలిపారు.