ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటా: డీకే అరుణ

ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటా: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటానని ఆ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని న్యూస్ పేపర్లు, చానల్స్ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. బీజేపీ నుంచి వలసలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ లీడర్లు కొన్ని చానల్స్, మీడియాకు బాధ్యతలు అప్పగించినట్లు అనుమానం వస్తున్నదని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్​నోట్​లో పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్న విషయం మీడియాకు కనిపించడం లేదా? అని ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నట్లు మళ్లీ ఎవరైనా ప్రచారం చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.