అసెంబ్లీకి డీకే అరుణ.. జాయింట్ సెక్రెటరీకి హైకోర్టు ఆర్డర్ కాపీ అందజేత

అసెంబ్లీకి డీకే అరుణ..  జాయింట్ సెక్రెటరీకి హైకోర్టు ఆర్డర్ కాపీ అందజేత

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో కార్యదర్శి పేషీకి హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు వెళ్లారు. డీకే అరుణతో పాటు అసెంబ్లీకి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కూడా వెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డిని కలిశారు డీకే అరుణ.

ALSO READ:రమ్మన్నారు.. రిజెక్ట్ చేశారు.. ఏం జరిగిందో తెలియదు?

2018 ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది హైకోర్టు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత స్థానంలో నిలిచిన డీకే అరుణను గద్వాల్ ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వెళ్లారు డీకే అరుణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.