రమ్మన్నారు.. రిజెక్ట్ చేశారు.. ఏం జరిగిందో తెలియదు?

రమ్మన్నారు.. రిజెక్ట్ చేశారు.. ఏం జరిగిందో తెలియదు?

బుల్లితెరపై మరో రెండు రోజుల్లో బిగ్ బాస్(Bigg boss) సందడి మొదలు కానుంది. నిజానికి ఈ సీజన్ కోసం ఆడియాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రానున్నారు? టాస్క్ ఎలా ఉండబోతున్నాయి? గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి? అని తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.   

ALSO READ:రాఖీ పండక్కి బాగా తినేశారా.. ఈ డిటాక్స్ డ్రింగ్స్ తాగండి.. యాక్టివ్ అవుతారు..

ఇందులో భాగంగానే.. మై విలేజ్ షో తో పాపులరైన అనిల్ గీల(Anil geela) బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే వార్త కొంతలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ వార్తలు అనిల్ వద్దకు కూడా చేరడంతో తాజాగా స్పందించాడు. బిగ్ బాస్ ఎంట్రీపై చర్చలు జరిగాయి. నా ఫ్యామిలీ, టీమ్ అండ్ ఫ్రెండ్ కూడా నేను వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. ఇలాంటి అవకాశాలు అందరికీ రాదు, చాలా అరుదుగా వస్తుందని చెప్పారు. మా అమ్మ కూడా సమయాన్ని వృధా చేసుకోకని, బిగ్ బాస్ కు వెళ్లి డబ్బులు సంపాదించు అని చెప్పడంతో సరే అన్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుండి నా ఫ్రెండ్స్, ఫాలోవర్స్ మెసేజ్ లు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్టాటజీలు ప్లే చేయకుండా నిజాయితీగా ఉండమని, మేము మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. ఇక బిగ్ బాస్ నుంచి కూడా కాల్ కూడా వచ్చింది. ఇక అంతా ఒకే, అన్నిసెట్ అయ్యాయి అనుకొనేలోపు.. మల్లి వాళ్ళు కాల్ చేసి నిన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పారు. అసలు నన్ను వాళ్లు ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం ఇప్పటికి తెలియదు అని చెప్పుకొచ్చాడు అనిల్ గీల. ఈ న్యూస్ తెలిసి అనిల్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ డిసప్పాయింట్   అవుతున్నారు.