- శానిటేషన్ కాంట్రాక్టర్‌కు మెమో
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని డీఎంఈ(డైరెక్టర్ మెడికల్ హెల్త్) నరేందర్ కుమార్ ఆదివారం సందర్శించారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న భరత్‌కుమార్‌ను పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం భరత్‌కుమార్ ను ఎలుకలు కొరకగా, ఈ విషయాన్ని వెలుగు దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో, హుటాహుటిన డీఎంఈ ఎంజీఎంకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు.
గతంలో ఎలుకలు కరిచి ఓ బాలుడు చనిపోయిన విషయంపై అధికారులతో చర్చించారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై ఆయన సీరియస్ అయ్యారు. అనంతరం అధికారులతో సమావేశమై ఎలుకలు రాకుండా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే ఎలుకలు, పాములు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ తెలిపారు. శానిటేషన్ కాంట్రాక్టర్‌కు మెమో జారీ చేశారు. డీఎంఈ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్, ఆర్ఎంవో శశికుమార్ ఉన్నారు.
