గోదావరిఖనిలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో తనిఖీలు

గోదావరిఖనిలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో తనిఖీలు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని పలు ప్రైవేట్​ హాస్పిటళ్లలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో అన్నప్రసన్నకుమారి శనివారం తనిఖీలు నిర్వహించారు. సిగ్మా, మమత హాస్పిటళ్లలో సీఎం రిలీఫ్​ఫండ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. 2023–-24 ఏడాదిలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్న పేషెంట్లకు సంబంధించిన ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వివరాలను చెక్ చేశారు. కాగా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మారడంతో పాత రికార్డులు తమ వద్ద లేవని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో దృష్టికి తీసుకొచ్చారు. 

తనిఖీలకు సహకరించని మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కాగా డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాహుల్​ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేసేందుకు రాగా ఆయన సహకరించలేదు. మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో లేకపోవడంతో గంట సేపు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోనే వేచి ఉన్నారు. అయినప్పటికీ రాకపోవడంతో ఆయనకు స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేస్తారన్న ప్రచారంతో పెద్దఎత్తున 30వ డివిజన్ మహిళలను అక్కడికి పంపించారు. చివరకు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో మాట్లాడుతూ పలు హాస్పిటళ్లలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రికార్డుల పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు. కాగా చెందిన మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాహుల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో రికార్డుల తనిఖీలకు సహకరించలేదని చెప్పారు.