- డీఎంహెచ్వో మనోహర్
యాదాద్రి, వెలుగు : అందుబాటులో ఉన్న వైద్య సేవలను ఉపయోగించి మాతా శిశు మరణాలను తగ్గించాలని డీఎంహెచ్వో డాక్టర్ మనోహర్ వైద్య సిబ్బందికి సూచించారు. సార్వత్రిక ఆరోగ్య విస్తృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, భువనగిరి జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు ఆరోగ్య పథకాల గురించి వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ అందజేస్తున్న సేవలు, టోల్ ఫ్రీ నంబర్ 15100 గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్, ఆర్ఎంవో డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

