టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని సులానగర్ పీహెచ్సీని డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ గురువారం తనిఖీ చేశారు. ఇంజక్షన్ గది, ఫార్మసీ స్టోర్, రక్త పరీక్షల గది, టీకాల నిల్వ గది, కాన్పుల గదిని, ఇన్ పేషెంట్ వార్డ్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించడానికి సిబ్బంది సరైన చర్యలు తీసుకోవాలన్నారు. టీ హబ్ ద్వారా చేసే రక్త పరీక్షల సంఖ్యను పెంచాలని చెప్పారు.
గర్భిణులకు అన్ని రకాల వైద్య సేవలను సకాలంలో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కందుల దినేశ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు..
టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి కందుల దినేశ్చలికాలంలో వచ్చే వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్ ధరావత్ నాగేశ్వరరావు, వార్డెన్ బి. నాగేశ్వరరావు, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా తదితరులు పాల్గొన్నారు.
