ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరగాలి : డీఎంహెచ్వో కళావతి బాయి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరగాలి : డీఎంహెచ్వో కళావతి బాయి

మధిర, వెలుగు:   ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగేలా చూడాలని డీఎంహెచ్​వో కళావతి బాయి డాక్టర్లకు సూచించారు.  మండలంలోని దెందుకూరు  పీహెచ్ సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫీల్డ్ సిబ్బంది విధుల్లో వున్న  వివరాలు డాక్టర్ పృథ్విని అడిగి తెలుసుకున్నారు. 

డెంగీ, వైరల్ ఫీవర్స్ సోకకుండా చర్యలు చేపట్టాలన్నారు. మహదేవపురంలో నిర్మాణంలో ఉన్న పల్లె దవాఖాన భవననాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లో  పీహెచ్ సీ ఆఫీసర్ వి వెంకటేశ్వర్లు, డాక్టర్ చెరుకూరి దివ్య శృతి, సిబ్బంది పాల్గొన్నారు.