పద్మారావునగర్, వెలుగు: గర్భిణులు, బాలింతలకు నిరంతర వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి సూచించారు. యశోద దవాఖానలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యూపీహెచ్‌సీల్లో గర్భిణుల రిజిస్ట్రేషన్లు పెంచాలని, సర్కార్ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కృషి చేయాలని సూచించారు. డయాబెటిస్, బీపీ, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ జయమాలిని, ఇమ్యూనైజేషన్ అధికారి పాల్గొన్నారు.
