పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నోళ్లు దేశ ద్రోహులు

పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నోళ్లు దేశ ద్రోహులు
  • హర్యానా మంత్రి అనీల్ విజ్ కామెంట్స్

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించడంపై మన దేశంలో సంబురాలు జరుపుకున్న వాళ్లు ఇండియన్స్ కాదంటూ హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ అన్నారు. భారత్ లో ఉంటూ పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న వాళ్లలో ఉన్నది ఇండియా డీఎన్ఏ కాదని అభిప్రాయపడ్డారు. మన దేశంలోనే మన మధ్యనే తిరుగుతున్న ఇలాంటి దేశద్రోహుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

దుబాయ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రెండు దాయాది దేశాలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో మన దేశంలో క్రీడాభిమానులతో సహా అంతా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతుంటే.. అక్కడక్కడా మాత్రం కొందరు పాక్ విజయంపై సంబురాలు జరుపుకున్నారు. 

పాక్ విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో  ఒక ప్రైవేట్ స్కూల్ లో పని చేస్తున్న మహిళా టీచర్ ‘మనం గెలిచాం’ అన్న క్యాప్షన్ తో పాక్ క్రికెటర్ల ఫొటోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంది. దీంతో ఆమెను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. మరో వైపు పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో ఉన్న భాయ్ గురుదాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో స్టూడెంట్స్ మధ్య ఈ మ్యాచ్ కారణంగా గొడవ జరిగింది. ఈ కాలేజీలో చదువుతున్న కొందరు కశ్మీరీ విద్యార్థులు పాక్ గెలుపుతో సంబురాలు చేసుకుంటూ ఆ దేశాన్ని పొగుడుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు భావోద్వేగానికి లోనై, వాళ్లతో వాగ్వాదానికి దిగారు. పాక్ అనుకూల నినాదాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు గ్రూప్ ల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఇలా పలు చోట్ల జరిగిన ఘటనల నేపథ్యంలో హర్యానా మంత్రి మన మధ్యనే ఉన్న దేశ ద్రోహుల విషయంలో అప్రమత్తంగా  ఉండాలంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

రేప్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

వరి విత్తనాలు అమ్మితే షాపులు బంద్ చేస్తం: కలెక్టర్ హుకుం

పోర్న్ సైట్‌లో లెక్కల పాఠాలు.. ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయం