రేప్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

V6 Velugu Posted on Oct 26, 2021

ఇండోర్: రేప్ కేసులో దాదాపు ఏడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకును మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను రేప్ చేశాడంటూ ఓ మహిళ ఉజ్జయిని జిల్లా బద్నాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీ మోర్వాల్ కొడుకు కరణ్ మోర్వాల్ పై ఇండోర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ఈ ఏడాది ఏప్రిల్ 2న రేప్ కేసు నమోదైన నాటి నుంచి కరణ్ పరారీలో ఉన్నాడు. అతడిని అరెస్టు చేసేందుకు గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో కరణ్ సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో గత నెలలో ఆ నజరానాను రూ.15 వేలకు పెంచారు. మళ్లీ గత శుక్రవారం ఈ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు గత వారం ఎమ్మెల్యే చిన్న కొడుకు శివంను ఇండోర్ మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు. ఆ తర్వాత ఎట్టకేలకు ఇవాళ ఉదయం షజాపూర్ జిల్లా మక్సీ టౌన్ లో కరణ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అతడిని అరెస్టు చేసి తమ టీమ్ ఇండోర్ కు తీసుకొచ్చినట్లు ఇండోర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ జ్యోతీ శర్మ చెప్పారు. అరెస్టు తర్వాత లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నామని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తల కోసం: 

వరి విత్తనాలు అమ్మితే షాపులు బంద్ చేస్తం: కలెక్టర్ హుకుం

టీకా వేసుకోకపోతే రేషన్, పెన్షన్ బంద్

ముగిసిన అమిత్ షా పర్యటన.. కశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్ 

Tagged rape case, Congress MLA, Madhya Pradesh

Latest Videos

Subscribe Now

More News