వ్యాక్సిన్ తీసుకోనివారిపై హెల్త్ డైరెక్టర్ కీలక నిర్ణయం

వ్యాక్సిన్ తీసుకోనివారిపై హెల్త్ డైరెక్టర్ కీలక నిర్ణయం

థర్డ్‎వేవ్ భయం పోవడంతో జనాలు వ్యాక్సిన్ తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు. దాంతో టీకా వేసుకోకపోతే రేషన్, పెన్షన్ ఆపేస్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపామని ఆయన తెలిపారు. అయితే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందని ఆయన అన్నారు. డ్యూ డేట్ అయిపోయినా కూడా వ్యాక్సిన్ తీసుకోనివారు 38 లక్షల మంది ఉంటారని ఆయన తెలిపారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 2 కోట్ల 13 లక్షల 18 వేల మంది ఉన్నారని.. 86 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఆయన చెప్పారు. థర్డ్ వేవ్ భయం పోవడంతో ప్రజలు టీకాను లైట్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. కొంతమంది అయితే ఇప్పటి వరకు సింగిల్ డోస్ కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. దీంతో టీకా మస్ట్ చేయాలనే ఆలోచనతో రేషన్, పెన్షన్ బంద్ నిబంధన తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.