పోర్న్ సైట్‌లో లెక్కల పాఠాలు

V6 Velugu Posted on Oct 26, 2021

పోర్న్ వెబ్ సైట్లలో అశ్లీల ఫొటోలు, వీడియోలు ఉంటాయనే విషయం వినే ఉంటారు. కానీ అలాంటి సైట్లలో కూడా లెక్కలు పాఠాలు చెప్పొచ్చని ఓ టీచర్ నిరూపించాడు. తైవాన్‌కు చెందిన ఆ మ్యాథ్స్ టీచర్ పేరు చంగ్‌షూ. ఆయన ఓ పోర్న్‌ వెబ్‌ సైట్‌లో మ్యాథ్స్ లెస్సన్స్ చెబుతుంటారు. అయితే అశ్లీల సైట్‌లో లెక్కల పాఠాలు ఎవరు చూస్తారనే సందేహం మీకు రావొచ్చు. కానీ పోర్న్ సైట్ లో వెరిఫైడ్ అకౌంట్ కలిగిన చంగ్‌షూ వీడియో లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చంగ్‌షూ మ్యాథ్స్ క్లాసెస్ వీడియోలకు మిలియన్ల వ్యూస్ రావడాన్ని బట్టి ఆయన పాఠాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోల ద్వారా ఆయన ఏడాదికి రూ.2 కోట్లకు పైనే సంపాదిస్తుండటం గమనార్హం. దీన్ని బట్టి ప్లాట్‌ఫామ్‌తో సంబంధం లేకుండా ప్రజలు తమ మ్యాథ్స్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పొచ్చు. 

పోర్న్ సైట్ లో అకౌంట్‌ను ఆపరేట్ చేస్తున్న చంగ్‌షూ.. ఎక్స్‌వీడియోస్ లాంటి ఇతర అశ్లీల సైట్లలో కూడా ఖాతాలను కలిగి ఉన్నాడు. అయితే పోర్న్‌ సైట్ లో వస్తున్న స్పందన మిగిలిన సైట్లలో రాలేదట..దీనిపై చెంగ్‌షూ స్పందిస్తూ.. తైవాన్‌ లో క్యాల్‌కులస్ బాగా నేర్పే ఓ టీచర్ ఉన్నాడని ప్రపంచానికి చెప్పాలనే ప్రయత్నంతోనే పోర్న్ సైట్లలో లెక్కల పాఠాలు చెబుతున్నానని చంగ్‌షూ అన్నాడు.

మరిన్ని వార్తల కోసం: 

రేప్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు ఆరెస్ట్

వరి విత్తనాలు అమ్మితే షాపులు బంద్ చేస్తం: కలెక్టర్ హుకుం

టీకా వేసుకోకపోతే రేషన్, పెన్షన్ బంద్

Tagged maths classes, Teacher, Taiwan, Porn Web Site, Maths Teacher, Earns Crores, Changshu

Latest Videos

Subscribe Now

More News