2 లక్షల మంది అమెరికా వీడాల్సిందేనా?

2 లక్షల మంది అమెరికా వీడాల్సిందేనా?

హెచ్1బీ వీసా హోల్డర్లకు కరోనా కష్టాలు
జూన్ నెలాఖరుతో ముగియనున్న లీగల్ స్టేటస్
పొడిగించాలని ట్రంప్ కు టెక్ నెట్ కంపెనీ విజ్ఞప్తి

వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్ పడింది. గ్రీన్‌‌‌‌కార్డ్ ‌సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగమూ పోవడంతో అక్కడ ఉండడమే ప్రశ్నార్ధ‌కంగా మారింది. వేరే ఉద్యోగం దొరికే పరిస్థితి లేక పోవడం, జూన్‌ ‌‌నెలాఖరు నాటికి వీసా గడువు ముగుస్తుండడంతో అమెరికాలో ఉండేందుకు లీగల్ స్టేటస్ కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. వాళ్లంతా సొంత దేశాలకు వెళ్లి పోవాల్సిందేనని నిపుణులు చెబుతుండడంతో, సుమారు 2 లక్షల మంది హెచ్1బీ వీసాహోల్డర్ల‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే పలు నిర్ణ‌యాలు తీసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేశాక ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఇమిగ్రేషన్ ‌‌‌ప్రాసెస్‌‌‌‌ను టెంపరరీగా ఆపేశారు. గ్రీన్ కార్డుల జారీ
ప్రాసెస్ ను 60 రోజుల పాటుహోల్డ్ ‌‌‌‌లో పెట్టారు. దీంతో హెచ్1 బీ వీసా హోల్డర్ల పరిస్థితి క్వశ్చన్ మార్క్‌‌‌‌గా మిగిలిపోయింది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం.. హెచ్‌‌‌‌1బీ వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోతే 2 నెలల్లోపు వేరే ఉద్యోగంలో చేరాలి. కొత్త కంపెనీ తరఫున వీసా రెన్యువల్ చేసుకోవాలి. మామూలుగా అయితే వేరే ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టం కాదు కానీ లాక్‌డౌ న్‌‌తో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయిన ఈ పరిస్థితుల్లోఅది సాధ్యమయ్యేది కాదన్నది నిపుణుల మాట. పైగా ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని ట్రంప్ సర్కార్ నిర్ణ‌యించింది.

మనోళ్లే ఎక్కువ

అన్ని రంగాలనూ లెక్కలోకి తీసుకుంటే ఐటీ సెక్టార్‌‌‌‌లోనే ఎక్కువగా హెచ్‌‌‌‌1బీ వీసా హోల్డర్లున్నారు. ఆ వీసాతోనే ఇక్కడ నివాస హోదా లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. మొత్తంగా హెచ్‌‌‌‌1బీ వీసా హోల్డర్ల‌లో మనోళ్లే దాదాపు 70% దాకా ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ తో‌ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు వేరే ఉద్యోగం రావడం, వీసా రెన్యువల్ ప్రశ్నార్థ‌కం అవడంతో వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

సెప్టెంబర్ 10 వరకు గడువు పెంచాలి

కరోనా కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హెచ్‌1బీ వీసాహోల్డర్ల లీగల్ స్టేటస్‌ను సెప్టెం బర్ 10 వరకు పొడిగించాలని ప్రముఖ లాబీయింగ్ సంస్థ టెక్ నెట్ కోరుతోంది. ఏప్రిల్ 17 న అమెరికా ప్రెసిడెంట్‌కు లెటర్ రాసింది. హెచ్‌1బీ వీసా హోల్డర్స్ ఎక్కువగా పనిచేస్తున్న యాపిల్, అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలకు ఈ టెక్ నెట్ కంపెనీ లాబీయింగ్ చేస్తుంది. ఆయా సంస్థలు అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.