పిల్లలు మాటిమాటికి చిరాకుపడుతున్నారా..?

పిల్లలు మాటిమాటికి చిరాకుపడుతున్నారా..?
  • పిల్లల ధోరణికి కారణమేంటంటే 

పిల్లల బిహేవియర్​ కొన్నిసార్లు కొత్తగా అనిపిస్తుంది. కొందరు పిల్లలు మాటిమాటికి చిరాకు పడుతుంటారు. మరికొందరు మూడీగా ఉంటారు. వాళ్లు అలా ప్రవర్తించడానికి కొన్ని కారణాలేంటంటే...

పిల్లలు హుషారుగా ఉండాలంటే కంటినిండా నిద్ర ఉండాలి. నిద్రలేకపోతే వాళ్లు మూడీగా, డల్​గా కనిపిస్తారు. 

వాళ్లకి హెల్దీ ఫుడ్​, అది కూడా టైమ్​కి తినిపించాలి. పోషకాలు లేని ఫుడ్ తింటే పిల్లలు యాక్టివ్​గా ఉండరు. దాని ఎఫెక్ట్ వాళ్ల మూడ్​ని మార్చేస్తుంది. 
రోజూ ఫలానా టైమ్​కి, ఫలానా పని చేయడం పిల్లలకి అలవాటు చేయాలి. దాంతో వాళ్ల మైండ్​ ఒక ఫార్మాట్​కి అలవాటు పడుతుంది.
పిల్లలు ఆటలు, చదువులో పడి నీళ్లు తక్కువ తాగుతారు. ఒంట్లో నీరు తగ్గడంతో డీహైడ్రేషన్​కి గురవుతారు.

అలా జరగకూడదంటే వాళ్లు ఇంటికి రాగానే నీళ్లు తాగించాలి. 
ఆరుబయట ఆటలు ఆడకపోవడం వల్ల కూడా పిల్లలు డల్​గా కనిపిస్తారు.

స్మార్ట్​ఫోన్లు చూడడం, ఫోన్​లో ఎక్కువ సేపు గేమ్స్​ ఆడడం వంటివి కూడా పిల్లల బిహేవియర్​ మీద ఎఫెక్ట్​ చూపిస్తాయి.