సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: పాకిస్తాన్, టెర్రరిజం విషయంలో తమ వైఖరి మారదని కేంద్రం ప్రకటించింది. అదే విధంగా..పాక్ తో దౌత్యపరమైన చర్యల విషయంలోనూ తమ వైఖరీలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా..సింధూ జలాల ఒప్పందం రద్దులో ఎలాంటి మార్పు లేదని.. తమ నిర్ణయాన్ని కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన ఈ ఒప్పందం రద్దు లేదా సవరణపై ఎటువంటి కొత్త నిర్ణయాలూ తీసుకోలేదని చెప్పింది.

 సింధూ విషయంలో పాకిస్తాన్ తీసుకునే చర్యలకు దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నమని వివరించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తామని..పాకిస్తాన్ చేసే ప్రతి దాడినీ తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది. భవిష్యత్తులో పాక్ నుంచి ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం పేర్కొంది. కాగా.. సింధూ ఒప్పందంపై తమ సంస్థ ఎలాంటి జోక్యం చేసుకోదని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఇటీవల వెల్లడించారు.  భారత్, తన జల వనరుల వినియోగంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ, జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంపై దృష్టి సారించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.