కస్టమర్లపై సర్వీస్ ఛార్జీ వేయొద్దు

కస్టమర్లపై సర్వీస్ ఛార్జీ వేయొద్దు

న్యూఢిల్లీ : హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్లు  కస్టమర్ల బిల్లులలో ఆటోమెటిక్‌‌‌‌గా లేదా డిఫాల్ట్‌‌‌‌గా సర్వీస్‌‌‌‌ ఛార్జీలను వేయడాన్ని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్‌‌‌‌ అథారిటీ (సీసీపీఏ) నిషేధించింది. ఒకవేళ సర్వీస్‌‌‌‌ ఛార్జీలను వేస్తే అటువంటి హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. కస్టమర్ల అనుమతి లేకుండానే సర్వీస్ ఛార్జీలను వేస్తుండడంతో  ఈ మధ్య కాలంలో హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లపై ఫిర్యాదులు పెరిగిన విషయం తెలిసిందే. ఇటువంటి విధానాలను నివారించడానికి సీసీపీఏ  కొన్ని  గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను ఇష్యూ చేసింది. ఈ గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం, ఏ హోటల్ లేదా రెస్టారెంట్ ఆటోమెటిక్‌‌‌‌గా లేదా డిఫాల్ట్‌‌‌‌గా సర్వీస్‌‌‌‌ ఛార్జీని వేయకూడదు. ఇతర పేరులు పెట్టి సర్వీస్‌‌‌‌ ఛార్జీని వసూలు చేయకూడదు. ఏ హోటల్‌‌‌‌ లేదా రెస్టారెంట్‌‌‌‌ కూడా సర్వీస్ ఛార్జీ చెల్లించాలంటూ కస్టమర్లను బలవంతం చేయకూడదు. సర్వీస్ ఛార్జీని చెల్లించడం ఆప్షనల్‌‌‌‌ అని కస్టమర్లకు తెలియచేయాలి. అంతేకాకుండా కస్టమర్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించలేదని వారికి ప్రవేశాన్ని రిస్ట్రిక్ట్‌‌‌‌ చేయడం లేదా కొన్ని సర్వీస్‌‌‌‌లను అందించకపోవడం వంటివి చేయకూడదని సీసీపీఏ హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లకు ఆదేశాలు ఇచ్చింది. ఫుడ్ బిల్లులో సర్వీస్ ఛార్జీని యాడ్ చేసి, ఆ మొత్తం అమౌంట్‌‌‌‌పై జీఎస్‌‌‌‌టీని (GST) వసూలు చేయకూడదు.