మంచి నిద్ర పట్టాలంటే చేయాల్సినవి.. చేయకూడనివి..

మంచి నిద్ర పట్టాలంటే చేయాల్సినవి.. చేయకూడనివి..

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. కొందరికి త్వరగా నిద్రపట్టదు. మరికొందరికి మధ్యరాత్రి మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టకపోవడం, తెల్లారిన తర్వాత నిద్ర వస్తుంది. ఈ ప్రాబ్లమ్‌‌ వల్ల రోజంతా అలసినట్లు, నీరసంగా అనిపిస్తుంది. డైజెషన్‌‌ ప్రాబ్లమ్స్‌‌, తలనొప్పి వస్తాయి. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

ఒకే స్లీప్ ప్యాటర్న్‌‌ ఫాలో అవ్వాలి. అంటే రోజూ ఒకే టైమ్‌‌కు నిద్రపోవడం, ఒకే టైమ్‌‌కు నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. మొదట్లో కొంచెం కష్టమనిపించినా, తర్వాత నెమ్మదిగా అలవాటవుతుంది.
కొద్దిరోజులు కాఫీ, టీలు తగ్గించాలి. రోజూ ఒక్కసారికి మించి కాఫీ, టీలు తాగొద్దు. ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. ముఖ్యంగా సాయంత్రం చీకటిపడ్డ తర్వాత వీటిని అస్సలు తీసుకోకూడదు. 
పగటిపూట నిద్రపోవడం తగ్గించాలి. ఎప్పుడైనా బాగా అలసిపోయి పగలు నిద్రపోవాలనిపిస్తే, అరగంటకు మించకుండా చూసుకోవాలి. అరగంటకంటే ఎక్కువ నిద్రపోతే, రాత్రి సరిగ్గా నిద్రపట్టదు.
రెగ్యులర్‌‌‌‌గా ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. డైలీ వర్కవుట్స్‌‌ చేస్తుంటే, కచ్చితంగా రిజల్ట్‌‌ ఉంటుంది.
ఒక్కసారి బెడ్‌‌ ఎక్కాక స్మార్ట్‌‌ఫోన్‌‌ చూడటం, కాల్స్‌‌ చేయడం, ల్యాప్‌‌టాప్‌‌ ముందు పెట్టుకోవడం, పుస్తకం చదవడం కూడా చేయొద్దు. ఇవన్నీ నిద్ర రాకుండా చేస్తాయి.
రూమ్‌‌లో నిద్ర త్వరగా పట్టేందుకు అనువైన వాతావరణం క్రియేట్‌‌ చేసుకోవాలి. లైట్స్‌‌ అన్నీ ఆఫ్‌‌ చేయాలి. డిమ్ లేదా బెడ్‌‌లైట్స్‌‌ మాత్రమే వేసుకోవాలి. బెడ్‌‌పై ఎలాంటి వస్తువులు ఉండకూడదు. ఆయిల్‌‌ డిఫ్యూజర్‌‌‌‌ ఉంచుకుంటే, మంచి సువాసన వెదజల్లి తొందరగా నిద్రపడుతుంది.
నిద్రలేమికి అన్నింటికంటే ప్రధాన కారణం స్ట్రెస్‌‌. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, మెడిటేషన్‌‌ చేయాలి.
బెడ్‌‌పై వాలడానికి కనీసం అరగంట ముందే టీవీ ఆఫ్‌‌  చేయాలి. మంచినీళ్లు కూడా ముందే తాగాలి. బెడ్‌‌పై చేరాక ఏమీ తినకూడదు. లేకపోతే, డైజెషన్‌‌ సమస్యలు వస్తాయి. ఇవి నిద్రను చెడగొడతాయి.