ఐదుగురికి మించి గుమిగూడొద్దు: సీపీ

ఐదుగురికి మించి గుమిగూడొద్దు: సీపీ

గచ్చిబౌలి, వెలుగు : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్​అమలులో ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాశ్​మహంతి తెలిపారు.

కమిషనరేట్ లిమిట్స్​లో ఐదుగురికి మించి గుమిగూడొద్దని సూచించారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, రూల్స్​అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.