
హైదరాబాద్, వెలుగు: పొత్తులో భాగంగా కూకట్పల్లి సీటును జనసేనకు ఇవ్వొద్దని బీజేపీ స్టేట్ ఆఫీసు ముందు ఆ నియోజక వర్గ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. సోమవారం పార్టీ ఆఫీసు బయట మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
కూకట్ పల్లి సీటును జనసేనకు కేటాయించి, పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని హరీశ్ రెడ్డి సూచించారు. కూకట్ పల్లిలో బీజేపీ గుర్తు మీద ఎవరు పోటీ చేసినా గెలుస్తామని చెప్పేందుకు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు.