అంబర్పేట ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు : బీఆర్ఎస్ అసమ్మతి నేతల హెచ్చరిక

అంబర్పేట ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు : బీఆర్ఎస్ అసమ్మతి నేతల హెచ్చరిక

హైదరాబాద్ : అంబర్పేట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలోనే సొంత పార్టీ నాయకులు కాలేరు వెంకటేష్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరుకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అంబర్ పేట సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ఈసారి టికెట్ ఇవ్వొద్దని కోరారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ వద్దు కేసీఆర్ సార్
కాలేరుకు హఠావ్ అంబర్ పేట్ కో బచావ్
అందరినీ కలుపుకోలేని ఎమ్మెల్యే మాకొద్దు 
సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చండి.. అంబర్ పేటను కాపాడండి..

అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అంబర్ పేట్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేటకు చెందిన మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

ఒకవేళ కాలేరుకు మళ్లీ టికెట్ ఇస్తే ఎన్నికల్లో సహకరించవద్దని బీఆర్ఎస్ అసమ్మతి నేతలందరూ నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తమను చాలా చాలా ఇబ్బందులకు గురి చేశాడని, ఏనాడు తమను కలుపుకొని పోలేదన్నారు. కొత్తవారిని పైకి తీసుకురావాలని ప్రయత్నించారని ఆరోపించారు. కాలేరుకు కాకుండా మరో నేత ఎవరికి ఇచ్చినా తాము సహకరిస్తామని, గత ఎన్నికల కంటే ఈసారి అంబర్ పేట ఎమ్మెల్యే అభ్యర్థిని 30 వేల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఒకవేళ కాలేరుకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు.