అతికిస్తే రూ.1,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష

అతికిస్తే రూ.1,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష
  • పర్మిషన్​ లేకుండా మెట్రో పిల్లర్లకు పోస్టర్లేయొద్దు
  • అతికిస్తే రూ.1,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష: మెట్రో ఎండీ

హైదరాబాద్, వెలుగు:  మెట్రో రైల్ పిల్లర్లపై అనుమతి లేకుండా రాజకీయ నాయకుల పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌‌ రెడ్డి హెచ్చరించారు. అధికారికంగా ప్రకటనలు ఇవ్వొచ్చని, నిబంధనలు అతిక్రమిస్తే రూ.వెయ్యి ఫైన్​తో పాటు 6నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. మెట్రో రైల్ కనెక్టివిటీ వెహికల్స్ ‘‘స్విదా సర్వీసెస్” పది లక్షల రైడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం బేగంపేటలోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ప్యాసింజర్స్ సౌకర్యార్థం బలమైన ఫీడర్ నెట్‌‌వర్క్‌‌ నిర్మించడానికి తాము వివిధ సర్వీస్ ప్రొవైడర్‌‌లతో కలిసి పని చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు ఒప్పందం​

ఫీడర్ వెహికల్ సర్వీసెస్ తో మెట్రో రైల్ మొదటి, చివరి మైల్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు అర్బన్ మొబిలిటీ సర్వీసెస్ స్టార్టప్ స్విదా మొబిలిటీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్​తో పదేండ్ల ఒప్పందం కుదుర్చుకుంది. స్విదా వెహికల్స్ మియాపూర్, ఎల్బీనగర్, రాయదుర్గం, మెట్టుగూడ, ఉప్పల్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ వెహికల్స్​ సేవలను రోజుకు 3వేల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. ఎల్ అండ్ టీ ఎంఆర్‌‌‌‌హెచ్‌‌ఎల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి, స్విదా మొబిలిటీ ప్రైవేట్​ లిమిటెడ్​ సీఈఓ సిద్దార్థ రవి పాల్గొన్నారు.