ఆధ్యాత్మికం: ముక్కోటి ఏకాదశి(డిసెంబర్ 30).. ఈ పనులు అస్సలు చేయొద్దు..!

ఆధ్యాత్మికం: ముక్కోటి ఏకాదశి(డిసెంబర్ 30).. ఈ పనులు అస్సలు చేయొద్దు..!

హిందువులు ఏకాదశి రోజుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  పుష్యమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశికి ఉంటే విశిష్టత అంతా ఇంతా కాదు.  దీనినూ ముక్కోటి ఏకాదశి అంంటారు.  ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి డిసెంబర్​ 30న వచ్చింది. పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు ఆ రోజున విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. ఆ రోజున భక్తితో చేసే పూజల కంటే.. తెలియక చేసే కొన్ని పొరపాట్లు అశుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు..ముక్కోటి ఏకాదశి రోజు ( 2025 డిసెంబర్​ 30) ఏ పనులు చేయకూడదో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం  హిందువులకు ముక్కోటి  ఏకాదశికి మించిన పవిత్ర దినం మరొకటి లేదు. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే ఈ అద్భుత ఘడియల్లో భక్తులు నియమ నిష్టలతో ఉండటం ఎంతో ముఖ్యం. అంతేకాదు కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. 

బియ్యంతో తయారు చేసిన పదార్దాలు నిషేధం:  ఏకాదశి నాడు అన్నం తినకూడదు.  ఉపవాస దీక్షను పాటించాలి.  పురాణాల ప్రకారం ఏకాదశి రోజున బియ్యంలో ....మురాసురుడు...  అనే రాక్షసుడు నివసిస్తాబు. అందుకే బియ్యంతో తయారు చేసిన పదార్దాలు.. అన్నంలో రాక్షసులు ఉంటారు.  ఏకాదశి రోజున అన్నం  తింటే రాక్షస ఆహారం తిన్నట్టే.   అది మన ఆధ్యాత్మిక శక్తిని నాశనం చేస్తుందని  పండితులు చెబుతారు.

 తులసి ఆకులను కోయకూడదు: శ్రీమహావిష్ణువుకు తులసి అంటే ప్రాణం.  ఏకాదశి నాడు తులసి మాత కూడా విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుంది.   ఏకాదశి రోజున ( డిసెంబర్​ 30) తులసి దళాలను కోయడం మహాపాపమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  కాని ఆ రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చించాలి.  అందుకుగాను ముందు రోజున తులసి ఆకులను కోసి ఉంచుకోవాలి. 

జాగారణ : ముక్కోటి ఏకాదశి రోజున ( డిసెంబర్​ 30)  జాగరణ చేయాలి.  అంటే అస్సలు నిద్రపోకూడదు.  పగలు నిద్రపోవడం వలన వ్రత ఫలితం దక్కదు.  రాత్రి సమయంలో నిద్రపోకుండా హరినామస్మరణతో గడిపితే  వెయ్యి ఏళ్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 కఠినమైన మాటలు.. ప్రతికూల ఆలోచనలు: ముక్కోటి ఏకాదశి ( డిసెంబర్​30) రోజున ఎవరినీ దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మనస్సులో కోపం, ద్వేషం వంటి భావాలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా గొడవ పడితే ఆ రోజు చేసిన పుణ్యం అంతా వృధా అవుతుంది.

 ఉల్లి.. వెల్లుల్లి .. మాంసాహారం: ఏకాదశి రోజున (డిసెంబర్​ 30)  మాంసాహారం ముట్టకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇవి మనస్సును చంచలం చేసి భక్తి మార్గం నుంచి మళ్లిస్తాయి.

మద్యం తాగకూడదు:  ముక్కోటి ఏకాదశి రోజంతా ( 2025 డిసెంబర్​ 30) దేవుడిని ధ్యానించుకుంటే ఉండాలి.  ఆరోజుదీక్ష వ్రతాన్ని పాటించాలి.  అందువలన మద్యం సేవించకూడదు.. సిగరెట్​ తాగకూడదు. 

బ్రహ్మచర్యం పాటించకపోవడం: ఈ పవిత్ర దినాన శారీరక సుఖాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. మనస్సును, శరీరాన్ని నిర్మలంగా ఉంచుకుని శ్రీహరిని స్మరించుకోవాలి.  నేలమీదే పడుకోవాలి.  కాని నిద్రపోకూడదు. 

ముక్కోటి  ఏకాదశి రోజు  తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. భక్తితో విష్ణుమూర్తిని కొలిస్తే ఆ స్వామి అనుగ్రహం కలిగి అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.