ఎక్సర్సైజ్, యోగా చేసేటప్పుడు..మాస్కులు పెట్టుకోవద్దు

ఎక్సర్సైజ్, యోగా చేసేటప్పుడు..మాస్కులు పెట్టుకోవద్దు

న్యూఢిల్లీ: జిమ్లో ఎక్సర్సైజులు, యోగా చేసే టప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్కులు వేసుకోకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు వేసుకుంటే శ్వాస ఆడక, ఆక్సిజన్ అందక ప్రాణాపాయం కలిగే ముప్పు ఉందని హెచ్చరించింది. అవసరమైతే విండ్ షీల్డ్లు పెట్టుకోవాలని సూచించింది. ఆగస్టు5 నుంచి యోగా ఇన్‌స్టిట్యూ ట్ లు, జిమ్లు ఓపెన్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాటిని ఓపెన్ చేసే ముందు.. ఓపెన్ చేశాక ఏం చేయాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం గైడ్లైన్స్ జారీ చేసింది. లక్షణాల్లేని వాళనే ్ల వాటిలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. స్పాలు, సానాలు, స్టీమ్ బాత్లు, స్విమ్మింగ్పూల్లు ఓపెన్ చేసేందుకు మాత్రం ని రాకరించింది. కంటెయిన్మెంట్ జోన్లలో యోగా ఇన్‌స్టిట్యూ ట్లు, జిమ్లూ ఓపెన్ చేయకూడదని తేల్చిచెప్పింది.

ఆరోగ్య శాఖ ఇచ్చిన గైడ్లైన్స్ ఇవీ…

  • 65 ఏళకుపై బడిన వాళ్లు, వేరే జబ్బులున్నోళ్లు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో యోగాకానీ, జిమ్లో ఎక్సర్సైజులుగానీ చేయడానికి వీల్లేదు. వాళ్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యోగా ఇన్‌స్టిట్యూట్, జిమ్లదే.
  • కచ్చితంగా ఆరు అడుగుల దూరం పాటించాలి. వీలైతే ఇంకా దూరంగానే ఉండాలి. యోగా, ఎక్సర్సైజులు చేసేటప్పుడు తప్పమిగతా టైంలో ఆయా ఇన్‌స్టిట్యూ ట్ లలో మాస్కులు, ఫేస్కవర్లు తప్పనిసరిగా వాడాలి.ఎక్సర్సైజులు చేసేటప్పుడు మాత్రం వాడొద్దు. ప్రత్యేకించి ఎన్95 మాస్కుల జోలికి వెళ్లొద్దు .యోగా, ఎక్సర్సైజు చేసేటప్పుడు వాటిని పెట్టుకుంటే గాలి సరిగ్గా ఆడదు. ఆక్సిజన్ అందక ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది.
  • చేతులు క్లీన్ గా ఉన్నా సంస్థల వద్ద 40 నుంచి 60 సెకన్లపాటు చేతులను తరచూ కడుక్కోవా లి. ఆల్కహాల్ శానిటైజర్లతో 20 సెకన్లపాటు చేసుకోవాలి .
  • దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు కర్చీఫ్ లేదా టిష్యూ లేదా మోచేతిని అడ్డుపె ట్టుకోవాలి. కస్టమర్లు, ఆయా సంస్థల ఉద్యోగులు, మేనేజ్ మెంట్ ఆరోగ్య సేతు యాప్ను వాడాలి.
  • యోగా ఇన్‌స్టిట్యూ ట్లు, జిమ్లను ఓపెన్ చేసేటప్పుడు 4 చదరపు మీటరకో్ల వ్యక్తి ఉండేలా ఫ్లోర్ ఏరియా ఉండేలా చూసుకోవాలి.
  • జిమ్లలోని పరికరాల మధ్య ఆరు అడుగులదూరం ఉండేలా పక్కకు జరపాలి.వీలైతే జిమ్ల బయట స్పే స్ఉంటే ఆయా పరికరాలను అక్కడ పెట్టుకోవాలి.
  • వీలైనంత తక్కువ మందితో ఎక్సర్సైజుక్లాసులు నిర్వహించేలా వీలైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునే పద్ధతిని పెట్టాలి.
  • జిమ్ ఎం ట్రెన్సులు, బిల్డింగు , రూములను డిసిన్ఫెక్ట్ చేయాలి. వాష్రూములు, టాయిలెట్లను ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్టెంట్లతో శుభ్రం చేస్తుండాలి.
  • కస్టమర్లువర్కవుట్లకోసం వేరే షూలు తెచ్చుకు నేలా సంస్థలు సూచనలు చేయాలి. మేనేజ్మెంట్మాస్కులు, ఫేస్ కవర్లు, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో పెట్టాలి.
  • ఫేస్ మాస్కులు లేదా ఫేస్కవర్లు పెట్టుకున్నోళ్లకే అనుమతివ్వాలి.జిమ్లోని పరికరాలను శానిటైజ్ చేయాలి. ఎవరికి వాళ్లు తమతమ యోగా మ్యాట్లను తీసుకెళ్లాలి.