తన సహజ నటనతో ఆకట్టుకున్న..రుక్మిణి వసంత్ ఎవరో తెలుసా?

 తన సహజ నటనతో ఆకట్టుకున్న..రుక్మిణి వసంత్ ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో న్యాచురల్​ బ్యూటీల హవా నడుస్తోంది. సాయి పల్లవితో మొదలైన ఈ ట్రెండ్​ రోజు రోజుకీ ఊపందుకుంటోంది. రష్మిక మందన్నా, కీర్తి సురేశ్​ వంటి స్టార్​ హీరోయిన్లు సైతం డీ గ్లామర్​ రోల్స్​తో మెప్పిస్తున్నారు. 

లేటెస్ట్ గా ఇప్పుడు అదే బాటలో మరో యంగ్​ బ్యూటీ వచ్చేస్తోంది. ఇటీవల కన్నడలో సూపర్​ హిట్​ అయిన సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి( Sapta Sagaralu Dhaati) పేరుతో డబ్​ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రక్షిత్​ శెట్టి(Rakshith Shetty) జోడీగా రుక్మిణీ వసంత్(Rukmini Vasanth)​ అనే బెంగళూరు బ్యూటీ నటించి..ఆకట్టుకుంటుంది.  

ఆమె న్యాచురల్​లుక్స్కి, నటనకి  కన్నడ, తెలుగు యువత దాసోహం అంటున్నారు. ఈ సినిమాలోని సాంగ్స్​, సీన్స్.. షార్ట్స్ వీడియోస్ రూపంలో నెటిజన్స్ వావ్..అనేలా వైరలవుతున్నాయి. ఈ ఒక్క సినిమాతోనే.. రుక్మిణీ ఇంత ఫేమ్ అయితే..ఇక కన్నడలో మరిన్ని పెద్ద ప్రాజెక్ట్స్​లో చాన్స్​లు కొట్టేయడం కన్ఫర్మ్.

రుక్మిణీ వసంత్​..నటన,లుక్స్, సహజంగా ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ హక్కున చేర్చుకుంటారని బలంగా నమ్ముతుందట ఈ అమ్మడు. ఒక్క సినిమాతోనే తెలుగులో చాలా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ ఉన్నారు. ఇక రుక్మిణీ వసంత్​ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి మరి. 

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. 

రుక్మిణి వసంత్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. 


కల్నల్ వసంత్ వేణుగోపాల్, 2007లో జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉరీ వద్ద భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దును దాటకుండా భారీగా ఆయుధాలను కలిగి ఉన్న చొరబాటు దారులను అడ్డుకునే చర్యలో చంపబడ్డాడు. ఆమె తల్లి, సుభాషిణి వసంత్..తను భరతనాట్యం నృత్యకారిణి, ఆమె కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. 

  • Beta
Beta feature