ఆధ్యాత్మికం: పరమేశ్వరుడికి కైలాసం ఉంది కదా.. కాని స్మశానంలోనే ఎందుకు నివసిస్తాడు..!

ఆధ్యాత్మికం: పరమేశ్వరుడికి  కైలాసం ఉంది కదా.. కాని  స్మశానంలోనే ఎందుకు నివసిస్తాడు..!

శివుడు స్మశానంలో ఉండటానికి గల కారణం చాలా మందికి తెలియదు.  దానికి సంబంధించిన వివరణ ఒకటి ఉంది.. అనునాషిక పర్వంలో పార్వతి దేవి ... పరమేశ్వరుని ఇలా అడుగుతుంది. స్వామి మీరు ఎప్పుడూ స్మశానంలో ఉంటారు ఎందుకు? నీకు కైలాసం లాంటి వెండి కొండ ఉంది.   ఇంత గొప్ప అంతఃపురం ఉంది . కానీ స్మశానంలో ఎందుకు ఉంటారు.. మొదలగు విషయాల గురించి శివుడు.. సతీదేవికి ఏమి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. . 

నా అంతట నేను ఇక్కడ (స్మశానంలో) స్థిర నివాసం ఏర్పరచుకోలేదు పార్వతి.  బ్రహ్మదేవుని కోరికమేరకు.. ఆయన అడిగితే తాను స్మశానంలో ఉన్నానని.. అంతేకాని కైలాసంలో ఉండటం తనకు చేతకాక కాదని పార్వతిదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.  

స్మశానంలో ఉండే ఉగ్ర భూతములు ..కొన్నిప్రేతాత్మలు క్షుద్ర పూజలు చేసేందుకు  చీకటి పడిన తరువాత  గ్రామాల్లోకి .. జనాలు నివసించే ప్రదేశానికి  బయలుదేరి వెళతాయి. అక్కడ మునులను..బ్రాహ్మణులను..  అనుష్టానం చెయనీయవు. మంచి పనులు చేసే వారికి ఆటంకాలు కలుగజేస్తాయి. మరికొన్ని ప్రేతాత్మలు  జీవులను నానారకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్లను అనేక ఇబ్బందులు పెడతాయి. 

ఈ ఉగ్రమైనటువంటి భూత ..ప్రేత.. పిశాచ..... రాక్షసులు ఇళ్లలోకి వస్తాయి. అవి  స్మశానం వదిలి రాకుండా ఉండాలని   అక్కడ నర్తన  (డ్యాన్స్​) చేస్తుంటాను.  ఆ నర్తనను చూసి  అవి అక్కడే కూర్చుంటాయని ఇదే మొదటి కారణమని పరమేశ్వరుడు.. పార్వతిదేవికి తెలిపాడు. 

ఇక రెండో కారణండా...  మానవుడు బ్రతికున్నవాళ్ళు అందరూ నా వాళ్ళు... నీవాళ్లు అని వాళ్ల ఇంటికి ....  వీళ్ళ ఇంటికి వెళ్తాడు.. అనేక ప్రయాణాలు చేస్తాడు... అక్కడికి వెళ్తాడు ...ఇక్కడికి వెళ్తాడు..వాళ్ళ ఇంట్లో...వీళ్ళ ఇంట్లో  భోజనం చేస్తాడు..ఇలా అన్ని చోట్ల తిరుగుతాడు. కాని స్మశానానికి వెళ్దామా అంటే ఎవరూ రారు కదా సతీ అని వివరిస్తూ.. దేహం పడిపోయిన తర్వాత మానవుడు  రుద్రభూమిలోకి వస్తాడు.

ఇంతకాలం తన దేహాన్ని చూసి ఎంతగానో మురసిపోతూ.. అందంగా కనపడాలని ఫెయిర్  లవ్లీ లు.. ఇతర కాస్మోటిక్​ క్రీములు  రాసుకుంటా.. దోమలు కుట్టకుండా .. ఎన్నో ఆలౌట్ లు పెట్టి... ఏసీలో   పడుకోబెట్టిన దేహం  కట్టెలలో కాలిపోతూ ఉంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. అయ్యో .. చీకటి పడుతుంది..  నేను  స్మశానం దాటి  వెళ్లలేకపోతున్నాను... చీకటి పడితే జీవుడు అసలు వెళ్లలేడు కదా..  వీళ్లందరినీ నమ్ముకున్నాను అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడు ఉండడు.  చచ్చినవాడు వంద సార్లు చచ్చిపోతాను అనే భయంతో జీవుడు ఉంటాడు. అప్పుడు శివుడు నీకు నేనున్నాను బెంగ పెట్టుకోకు.. నీకు ఇంకొక శరీరం ఇస్తానని ఓదారుస్తాడు. వళ్ళు దగ్గర పెట్టుకుని జీవించు అని ప్రేతాత్మగా ఉన్న జీవునితో చెప్పి శాంత పరుస్తాడు.

 అందుకే  మరణించిన పదవరోజున అదే వంశస్తులు తిలోదకాలు ( నువ్వులు.. నీళ్లు)..ఇతర బంధువులు.. స్నేహితులు ధర్మోదకాలు ( బియ్యము, నీళ్లు) మరణించిన వ్యక్తి ప్రేతాత్మ తృప్తి చెందాలని ఆహారాన్ని  మంత్రాల ద్వారా అందిస్తారు.

 అంతేకానీ నాకు ఇల్లు లేక, అవాసం లేక, లేని వాడిని కాదు.  ప్రతి జీవికి తండ్రిగా ఉన్న నాకు ...అది కర్తవ్యం" అన్నాడు పార్వతితో.. శివుడు కదా దయ కరుణ సాగరుడు కదా..! అని సతీ దేవి తో తన "జీవితగమన" అసలు విషయాన్ని  చెపుతాడు శివుడు.