పిచ్చి పీక్స్ కు వెళ్లింది : ఆస్పత్రి ఆపరేషన్ ధియేటర్ లో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్

పిచ్చి పీక్స్ కు వెళ్లింది : ఆస్పత్రి ఆపరేషన్ ధియేటర్ లో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్

అది ఆస్పత్రి.. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి.. అలాంటి ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి.. ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అబ్బే వీళ్లు మాత్రం అందుకు అతీతం.. ఆ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్.. తన ప్రీ వెడ్డింగ్ షూట్ ను.. ఆస్పత్రిలోని ఆపరేషన్ ధియేటర్ లోనే పెట్టాడు.. ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తుండగా.. తన కాబోయే భార్యతో కలిసి.. చుట్టూ కెమెరామెన్లతో కలిసి ఫొటో షూట్ చేశాడు.. ఈ వీడియో వైరల్ కావటంతోపాటు.. పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ప్రభుత్వం స్పందించింది. ఆ డాక్టర్ ను ఏకంగా ఉద్యోగం నుంచి తీసేసింది.. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్ అభిషేక్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకున్నారు. డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో.. ఏకంగా ఆస్పత్రి ఆపరేషన్ ధియేటర్ లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టారు. తన కాబోయే భార్య కూడా డాక్టర్ డ్రస్ లో ఉంటుంది.. ధియేటర్ లో భర్త ఆపరేషన్ చేస్తుంటే.. భార్య అతని హెల్ప్ చేస్తున్నట్లు ఉంటుంది. చుట్టూ మూడు కెమెరాలు, లైట్లు, కెమెరామెన్లు ఉన్నాయి. చివరల్లో ఆ పేషెంట్ ఆపరేషన్ బెడ్ పై నుంచి లేస్తాడు.. 40 సెకన్ల ఈ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.

దీంతో కర్నాటక హెల్త్ మినిస్టర్ గుండూరావు స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన డాక్టర్.. ఇలా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ పెట్టటం అనేది సహించరాని నేరంగా స్పష్టం చేశారు. డాక్టర్ అభిషేక్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఓ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లను చూడాల్సిన డాక్టర్.. ఇలా ఆపరేషన్ ధియేటర్ లో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేయటంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. డాక్టర్లే ఇలా ఉంటే.. ఇక చికిత్స ఏం చేస్తారు.. రోగులను ఏం పట్టించుకుంటున్నారు అనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు.. ఈ డాక్టర్ పై చర్యలు తీసుకోకపోతే.. రాబోయే రోజుల్లో మిగతా డాక్టర్లు, సిబ్బంది సైతం ఇలాంటి చేష్టలే చేసే అవకాశం ఉందని భావించిన కర్నాటక ప్రభుత్వం.. ఆ డాక్టర్ ను తొలగించి.. మిగతా డాక్టర్లు, సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.