డాక్టర్ స్నిగ్ధాకు డెంటల్ ఆస్కార్.. హైబ్రిడ్ ఆర్థోడాంటిక్ మెకానిక్స్ సమస్యలను  పరిష్కరించడంలో ఎక్స్ పర్ట్

డాక్టర్ స్నిగ్ధాకు డెంటల్ ఆస్కార్.. హైబ్రిడ్ ఆర్థోడాంటిక్ మెకానిక్స్ సమస్యలను  పరిష్కరించడంలో ఎక్స్ పర్ట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరానికి చెందిన ప్రముఖ డెంటిస్ట్, డాక్టర్​ గౌడ్స్ ​డెంటల్ ​హాస్పిటల్​ చైర్మన్ ​అండ్​ సీఈవో డాక్టర్ ​స్నిగ్ధా గౌడ్​ ‘అలైనర్​ స్పెషలిస్టు ఆఫ్​​ది ఇయర్’ గౌరవాన్ని పొందారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘డెంటల్​ ఆస్కార్​’గా పిలిచే ప్రతిష్టాత్మకమైన ఫామ్​డెంట్​ఎక్స్​లెన్స్​అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలంగాణ ఆర్థోడెంటిస్ట్​గా ఆమె రికార్డు సృష్టించారు.

ఇండియన్​స్కూల్​ఆఫ్​ బిజినెస్​(ఐఎస్​బి) గ్రాడ్యుయేట్​అయిన స్నిగ్ధా.. క్లినికల్​ఎక్స్​పర్టైస్​గా పేరు తెచ్చుకున్నారు. డాక్టర్​ స్నిగ్దా గౌడ్​ 25 ఏండ్లుగా డెంటల్​రంగంలో సేవలందిస్తున్నారు. క్లిష్టమైన అలైనర్ థెరపీ,  హైబ్రిడ్ ఆర్థోడాంటిక్ మెకానిక్స్ సమస్యలను పరిష్కరించడంలో ఆమె ఎక్స్​పర్ట్​గా పేరుపొందారు. ఇన్విజాలైన్ ట్రీట్​మెంట్​లో వరుసగా మూడేళ్లు ప్లాటినం ప్రొవైడర్ గా నిలిచారు. ఇన్విజాలైన్ సంస్థ ఒక డాక్టర్ ఏడాదికి ఎన్ని క్లిష్టమైన కేసులను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశారనే దానిపై ఆధారపడి ప్లాటినం ప్రొవైడర్​అనే హోదాను ఇస్తారు.

ఈ లెక్కన డాక్టర్​ స్నిగ్ధా ఏడాదికి కనీసం 60 నుంచి 100 కంటే ఎక్కువ ఇన్విజాలైన్ చికిత్సలను పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా ఆర్థోడెంటిస్ట్​కూడా ఆమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ స్నిగ్ధ గౌడ్ మాట్లాడుతూ ‘ఈ అవార్డు మా రోగులు మాపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపం. ఆర్థోడాంటిక్స్ అంటే కేవలం పళ్లను సరిచేయడమే కాదు, ఒక వ్యక్తి రూపంలో, ఆత్మవిశ్వాసంలో సానుకూల మార్పు తీసుకురావడం" అని అన్నారు.