మంచిర్యాలలో ఫేక్ డాక్టర్ కలకలం?

మంచిర్యాలలో ఫేక్ డాక్టర్ కలకలం?

ఫేక్ సర్టిఫికెట్లతో ఓ డాక్టర్ వైద్యం చేస్తున్నాడంటూ... ఆరోపణలు రావడంతో అధికారులు ఆయన ఆస్పత్రిలో సోదాలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ వ్యవహారం కలకలం రేపింది.   జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీనిధి హాస్పిటల్ డాక్టర్ కృష్ణమూర్తి  సర్టిఫికెట్ లేకుండా కార్డియాలజీ వైద్యం చేస్తున్నట్టు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఉక్రెయిన్‌లో ఎండీ  చేసిన కృష్ణమూర్తిఇండియన్ కౌన్సిల్ అర్హత పరీక్ష రాయకుండానే కార్డియాలజిస్ట్‌గా కొనసాగుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో శ్రీనిధి ఆస్పత్రిపై అధికారులతో కలిసి DMHO దాడులు జరిపారు. 

కలెక్టర్ ఆదేశాలతో  శ్రీనిధి ఆస్పత్రిలో విచారణ చేస్తున్నామని డీఎమ్ హెచ్.వో కొమురం బాలు తెలిపారు. డాక్టర్ కృష్ణమూర్తి ఉక్రెయిన్లో MBBS చదివారని MD ఫిజిషియన్  వైద్యం చేయడం నిబంధనలకు వ్యతిరేకమన్నారు డీఎమ్‌హెచ్ఓ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లేకుండానే  ఎండీగా సేవలు అందించడం నేరమన్నారు. డిప్లమా ఇన్ కార్డియాలజిస్ట్ సర్టిఫికెట్ తో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ డిస్టెన్స్ సర్టిఫికెట్ పై విచారణ చేస్తున్నామన్నారు. దీనిపై పూర్తి నివేదిక కలెక్టర్‌కు అందిస్తామని తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

ఆఫీసుల్లో సెల్ ఫోన్ వాడడంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

విధుల్లోకి ఐపీఎస్ అభిషేక్ మొహంతి