
పద్మారావునగర్, వెలుగు: తండ్రి నుంచి కుమారుడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను గాంధీ హాస్పిటల్ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం సూపరింటెండెంట్ రాజారావు వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన హరీశ్‌కుమార్(30) మెడికల్ రిప్రంజటేటివ్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న హరీశ్ కుమార్ ఇటీవల గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హరీశ్ కిడ్నీ పాడైపోవడంతో.. తండ్రి చంద్రమౌళి(55) కుమారుడికి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో శుక్రవారం గాంధీ డాక్టర్లు చంద్రమౌళి నుంచి కిడ్నీని తీసి వెంటనే హరీశ్‌కు అమర్చి ఆపరేషన్ చేశారు. లైవ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడం చాలా అరుదని సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల టీమ్, నర్సింగ్ స్టాఫ్ కు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ప్రస్తతం పేషెంట్ హరీశ్, కిడ్నీ డోనర్ చంద్రమౌళి హెల్త్ కండీషన్ బాగుందన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ల టీమ్‌లో గాంధీ యూరాలజీ డాక్టర్లు రవిచందర్, రవి, అనస్తీషియా డాక్టర్లు బేబిరాణి, భానులక్ష్మి, జ్యోత్స్న, నెఫ్రాలజీ డాక్టర్లు మంజూష, శ్రీకాంత్, స్రవంతి, ఉస్మానియా యూరాలజీ డాక్టర్లు ప్రసాద్, మల్లికార్జున్, సంతోశ్ ఉన్నారు.
కంటి సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండొద్దు
గ్లకోమా వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకోవాలని, కంటి సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు అన్నారు. గాంధీ హాస్పిటల్ లో గ్లకోమా అవగాహన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆవరణలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. గాంధీ ఐ కేర్ డిపార్ట్ మెంట్లో అన్ని రకాల కాంటాక్ట్ ఆపరేషన్లను తిరిగి ప్రారంభించామని.. కంటి సమస్యలున్న వారు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని హెచ్ వోడీ డాక్టర్ రవిశేఖర్ తెలిపారు.